Bandi Sanjay comments: కల్వకుంట్ల కవిత రాజీనామాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కవిత ఎపిసోడ్ అని అన్నారు. కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి కల్వకుంట్ల కవిత ఆడే డ్రామాగా బండి సంజయ్ వర్ణించారు. కవిత రాజీనామా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమని .. రాజీనామాతో తెలంగాణ ప్రజలకు ఏమీ రాదని అన్నారు. దీని వెనుక బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కవిత రాజీనామా అనేది ఆమెకు ఒక వ్యూహాత్మక చర్యగా పేర్కొన్నారు.
ప్రజల దృష్టిని ఆకర్షించడానికే: రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోతున్న సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబంలో ఎవరూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని… కవిత లాంటి మహిళా నాయకురాలు అప్పుడే రాజీనామా చేసి ఉంటే ప్రజల్లో మంచి పేరు వచ్చేదని అన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/mla-mallareddy-comments-on-mlc-kavitha-resignation/
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా: కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారం కోల్పోయింది కాబట్టి.. కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలసి కలిసి ఆడుతున్న డ్రామాగా తెల్పాడు. ఇది కేవలం బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాల ఫలితం మాత్రమే కాదని.. కవిత రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు తీసుకున్న నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు.


