సిపిఐ ప్రజా చైతన్య యాత్ర చిగురుమామిడి మండలంలో విజయవంతం అయింది. సిపిఐ ప్రజా చైతన్యత బృందానికి ఘన స్వాగతం లభించగా, గ్రామ గ్రామం నుండి భారీగా తరలివచ్చారు సిపిఐ కార్యకర్తలు, అభిమానులు.
చాడకు ప్రజల పుష్పాభిషేకం …
ఈనెల 15వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు బిజెపిని గద్దె దించండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో సిపిఐ జాతీయ పార్టీ పిలుపుమేరకు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర సిద్దిపేట జిల్లా మీదుగా చిగురుమామిడి మండలంకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిగురుమామిడి సిపిఐ మండల సమితి ప్రజా చైతన్య యాత్ర చాడ బృందానికి కార్యకర్తలు ప్రజలు మహిళలు పూల వర్షం కురిపించారు మంగళహారతులతో డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు సింగల్ విండో కార్యాలయం నుండి పాదయాత్రగా చిగురు మామిడి బస్టాండ్ వరకు చేరుకున్నారు. అంతకు ముందు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇందుర్తి మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం బస్టాండ్ ఆవరణలో అందే స్వామి, అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గడపగడపకు సిపిఐ నినాదంతో ప్రజా చైతన్య యాత్ర బయలుదేరిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామాన ప్రజలను పాలకుల వైఫల్యాలు నెత్తి చూపుతూ ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు నిత్యవసర వస్తువులు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ధరలు, అందుబాటులో లేవని ప్రజలు పూటగడవని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు, దీనివల్ల ఆర్థిక భారంతో మధ్య సామాన్య పేద ప్రజలు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృశ్య ప్రభుత్వాలు ప్రజలను విస్మరించి బడా బాబుల జేబులోని నింపుతున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణు శంకర్, మణికంఠ రెడ్డి ఏఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యదర్శి మరియు వెంకటస్వామి సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ ,పెద్దపెల్లిజిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, కొయ్యడ సృజన్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే నరసింహ, కుమార్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గూడెం లక్ష్మి, సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, ముద్ర కోళ్ల రాజయ్య తీరాల సత్యనారాయణ బూడిద సదాశివ ప్రజానాట్యమండలి మాజీ కార్యదర్శి గడిపే మల్లేశం, లంబాడి పల్లి సర్పంచ్ నాగేల్లి వాకులా లక్ష్మారెడ్డి గ్రామ సర్పంచ్ సీతారాంపూర్ గోలి బాపిరెడ్డి సుందరగిరి సర్పంచ్ శ్రీ మూర్తి రమేష్, రైతు సంఘం మండల కన్వీనర్ కాంతాల శ్రీనివాస్ రెడ్డి తాళ్లపల్లి చిన్న చంద్ర గౌడ్, రాష్ట్ర నాయకురాలు పద్మ వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.