ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించే బాధ్యత కలిగిన ఎఫ్ఎస్ఐబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తదుపరి ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు సెట్టిని నియమించేందుకు ఎఫ్ఎస్ఐబీ సిఫార్సు చేయటం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం.
36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం..
చల్లా శ్రీనివాసులు సెట్టికి ఎస్బీఐలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. జనవరి 2020లో ఎస్.బి.ఐ. బోర్డులో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరి, ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ వర్టికల్స్‌కు అధిపతిగా ఉన్నారు. ప్రస్తుత అసైన్‌మెంట్‌కు ముందు, రిటైల్-డిజిటల్ బ్యాంకింగ్ వర్టికల్‌కు ఆయన నాయకత్వం వహించారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ టాస్క్ ఫోర్స్/కమిటీలకు కూడా ఆయన నేతృత్వం వహిస్తున్నారు. వ్యవసాయంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్ అయిన చల్లా శ్రీనివాసులు 1988లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో, కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్-ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, అభివృద్ధి చెందిన మార్కెట్‌లలో బ్యాంకింగ్‌లో గొప్ప అనుభవం కలిగిన వ్యక్తిగా చల్లాకు పేరుగాంచారు.
కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ – స్ట్రెస్డ్ అసెట్స్ రిజల్యూషన్ గ్రూప్, చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్‌గా కార్పొరేట్ అకౌంట్స్ గ్రూప్, మిడ్ కార్పొరేట్ గ్రూప్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్, కొత్త ఎస్బీఐలో వీపీ-హెడ్ (సిండికేషన్స్)తో సహా కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం చల్లా శ్రీనివాసులుకు ఉండటం విశేషం. ప్రస్తుత చైర్మన్ పదవీ విరమణ చేసిన రోజునే కొత్త చైర్మన్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలం ఆగస్టు 2024లో ముగియనుంది.