తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం సాయంత్రం నంది నగర్ నివాసం లో … ఛలో నల్గొండ…భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి…నల్గొండ, ఖమ్మం,మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు సమన్వయ కర్తలతో …విడివిడిగా బిఆర్ఎస్ అధినేత సమావేశాలు నిర్వహించారు.
- Advertisement -
కృష్ణా నది పై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబి కి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ…తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్లగొండ పట్టణం లో ఈనెల 13 న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను అధినేత వారికి వివరించారు