భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా భారీ మెజారిటీతో విజయం సాధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆదివారం నాడు ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. గతంలో 2007 నుండి 2009 వరకు అఖిలభారత యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి.
18వ లోక్ సభకి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందిన శుభ సందర్భంగా వారిని ఢిల్లీలోని అఖిలభారత యువజన కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆఫీస్ బేరర్లు అందరూ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
Chamala falicitated by Youth cong: ఎంపీ చామల యువజన కాంగ్రెస్ సన్మానం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES