Friday, November 22, 2024
HomeతెలంగాణChautuppal: త్రిబుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తా

Chautuppal: త్రిబుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తా

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మున్సిపల్ పరిధిలో త్రిబుల్ ఆర్ డంబేల్ రింగ్ రోడ్ లో భూములు, ప్లాట్స్ కోల్పోతున్న బాధితులను ఆదుకొనుట గురించి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి సమక్షంలో జి ఎం టి ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి నరసింహా సహకారంతో కలిశారు.
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో త్రిపుల్ ఆర్ డంబెల్ ఆకారంలో తీస్తున్న రింగురోడ్డులో వ్యవసాయ భూములు కోల్పోతున్నమని, రెైతులు గతంలో కూడా ఎన్ హెచ్ 9 రోడ్డు విస్తరణలో రెండుసార్లు భూములు కోల్పోయారని, సోలార్ 11కేవీ ఒకసారి, హై టెన్షన్ టవర్స్ 132KV దివిస్ లేబరేటరీకి ఒకసారి, ప్రభుత్వ టవర్స్ కి రెండవ సారి భూములు కోల్పోయామనీ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ ఇప్పుడు త్రిబుల్ ఆర్ రింగురోడ్డులో ఉన్న భూములు కోల్పోవాల్సి వస్తోందన్నారు. చిన్న, సన్నకారు, మధ్యతరగతి పేద రైతులు వ్యవసాయ సాగుకు ఉపయోగపడే కోట్లకు విలువైన వ్యవసాయ భూములు కోల్పోయిన తర్వాత రైతుల జీవన పరిస్థితులు దెబ్బతిని, రోడ్డున పడతారని.. భూములలో ఖరీఫ్, రబీ రెండు రకాల పంటలు పండిస్తూ వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకే రెైతులు ఇప్పుడు భూములు పోతే ఎలాంటి బతుకు తెరువు లేక, ప్రత్యామ్నాయ ఆదాయాలు ఏంలేక రోడ్డున పడే దుస్థితి ఉందని జూలకంటి రంగారెడ్డి మంత్రికి వివరించారు.
భూములు కోల్పోతున్న రైతులకు, ఇండ్లు, ప్లాట్ లకి భూములకి భూములు లేదా భూసేకరణ చట్టం 2012 పరిగణలోనికి తీసుకొని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారుగా 4-5 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలి అని కోరారు. తదనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధితులతో మాట్లాడుతూ‌… రైతులకి నష్టం జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, భూములకు భూములు గాని లేకుంటే ప్లాట్లు, తగిన నష్టపరిహారం ఇస్తూ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు గుజ్జుల సురేందర్ రెడ్డి , చలమంద రాజు, జాల పెద్ద జంగయ్య, శ్రీశైలం, జంగయ్య, వెంకటేశం, యాదయ్య, బసవయ్య, నరసింహ,చిన్నవెంకటేష్ గుండెబోయిన గాలయ్య, రంగయ్య, వేణు బలికి నరసింహ ,ఎల్లప్ప, మధు చింతల ప్రభాకర్ రెడ్డి మరియు మార్గం మల్లయ్య, నరసింహ, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News