ఏకకాలంలో షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ హామీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శేఖర్ రెడ్డికీ వినతి పత్రం సమర్పించి ఈ సందర్భంగా మాట్లాడుతూ…
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలని అన్నారు. సాంకేతిక కారణాలతో బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూ ఉన్నారని , గ్రామాలలో రైతులకు కౌంటర్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వేల పేరుతో కాలయాపన చేయవద్దని అన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా పథకాన్ని బేషరతుగా అమలు చేయాలని అన్నారు.
ఆర్డీవో ముందు ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి,జల్లెల్ల పెంటయ్య, మద్దెల రాజయ్య, గుంటోజు శ్రీనివాస చారి,గంగాదేవి సైదులు, సిర్పంగి స్వామి,దోడ యాదిరెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం, నాయకులు చిరిక సంజీవరెడ్డి, పల్లె మధుకృష్ణ, రాగిరి కిష్టయ్య, బోయిని ఆనందు,పల్లె శివకుమార్, బోయ యాదయ్య తదితర సిపిఎం నాయకులు పాల్గొన్నారు.