చేగుంట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. జాతీయ పతాకావిష్కరణ ఎస్సై ఆర్ బాలరాజ్ ఆవిష్కరించారు. ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్రం అని వారిని స్మరించుకోవలసిన ఆవశ్యకత మన అందరి పైన ఉందని, వారు కన్న కలలను సహకారం చేయాలని బాలరాజ్ అన్నారు. దేశ భవిష్యత్తు ముఖ్యంగా యువత చేతుల్లోనే ఉందని, దేశభక్తి కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట పట్టణం ఎస్ఐ ఆర్ బాలరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.