చేగుంట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతికి ఘన నివాళి అర్పించారు. తాసిల్దార్ స్వప్న ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జయశంకర్ సార్ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాంతం కష్టపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ చేసిన సూచనలు సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తాయని వారన్నారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ స్వప్న ఆర్ఐ నర్సింగ్ యాదవ్ సర్వేయర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.