Friday, September 20, 2024
HomeతెలంగాణChegunta: బర్త్ డే పార్టీలో సునీతా లక్ష్మారెడ్డి

Chegunta: బర్త్ డే పార్టీలో సునీతా లక్ష్మారెడ్డి

ఆత్మీయంగా పలకరించిన ఎమ్మెల్యే

దొంతిలోని సిల్వర్ వీరేశం ఇంటికి బర్త్ డే పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వీరేశం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి ముచ్చటిస్తూ, పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ జిల్లా నుండి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారి బంధువు అక్కడే కనిపించగా, దగ్గరికి పిలిచి నీ పేరు ఏంటి అని అడగగా ఆ అమ్మాయి నా పేరు పేర్ల బిందు శ్రీ అని చెప్పి ఏం చదువుకుంటున్నావ్ అని అడిగితే మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్గల్ లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నానని ఆ అమ్మాయి చెప్పింది. మరి స్కూలు ఎలా ఉందమ్మా అని అడిగితే, ఆ అమ్మాయి టీచర్లు స్నేహంగానే ఉంటారని ఉదయం నాలుగున్నర గంటలకు నిద్ర నుండి లేపుతారని మార్నింగ్ వాక్ చేపిస్తారని, స్కూల్ గేమ్స్ ఆడిపిస్తారని ఆ అమ్మాయి చెప్పింది. నువ్వు బాగా చదువుకో అమ్మా భవిష్యత్తులో నీవు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, మీకేమైనా అవసరం వస్తే నన్ను కలవండి, నేను సహాయం చేస్తాను, చదివిపిస్తాను అని లక్ష్మణ్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కానుకుంట రవి సిలివేరి ఆంజనేయులు సిల్వేరి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News