Thursday, April 10, 2025
HomeతెలంగాణChegunta: పారిశుద్ధ్య కార్మికులను నియమించినందుకు థాంక్స్ చెప్పిన టీచర్స్

Chegunta: పారిశుద్ధ్య కార్మికులను నియమించినందుకు థాంక్స్ చెప్పిన టీచర్స్

చేగుంట మండలంలోని రెడ్డిపల్లి మక్క రాజుపేట అనంతసాగర్ రుక్మాపూర్ పులిమామిడి కిస్టాపూర్ చందాయిపేట్ బోనాల ఇబ్రహీంపూర్ కరీంనగర్ గొల్లపల్లి పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డు ఎల్లం చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించినందుకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పడం అభినందనీయమని, ఉపాధ్యాయుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే ప్రకటించాలని, డీఎస్సీ ఫలితాలను ప్రకటించి నూతన ఉపాధ్యాయులను నియమించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు దేశపతి కృష్ణమూర్తి తూప్రాన్ డివిజన్ తపస్ కార్యదర్శి ప్రభాకర్ చేగుంట తపస్ మండల అధ్యక్షుడు రావుల వెంకటేష్, తిరుపతి మల్లారెడ్డి సిద్ధిరాములు కృష్ణమూర్తి పరశురాం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News