Wednesday, September 18, 2024
HomeతెలంగాణChennuru: 666 మంది గిరిజనులకు 1,190 ఎకరాల పోడు పట్టాలు

Chennuru: 666 మంది గిరిజనులకు 1,190 ఎకరాల పోడు పట్టాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టత్మాకంగా చేపట్టిన కార్యక్రమం పోడు భూములు సాగుచేసుకుని జీవనధారంగా జీవనం గడుపుతున్న గిరిజన రైతులకు చెన్నూరు పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో చెన్నూరు నియోజకవర్గంలోని 666 మంది గిరిజనులకు 1,190 ఎకరాలకు పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ తోపాటు జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, అదనపు కలెక్టర్ రాహుల్, ట్రైని కలెక్టర్ గౌతమి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… దశాబ్దాలుగా ఈ అడవి తల్లి బిడ్డలు గుట్టలను చదును చేసి పోడు భూములను సాగు భూములుగా మలుచుకున్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా హక్కులు దక్కలేదని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోడురైతుల గోడు విని, రాష్ట్రవ్యాప్తంగా 1,51,146 మందికి పట్టాలు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు.

చెన్నూరు నియోజకవర్గంలోని 666 మంది గిరిజనులకు 1,190 ఎకరాలకు పోడు భూముల పట్టాల పంపిణీ చేసినట్టు తెలిపారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వరకు సాగు చేస్తున్న వారిని అర్హులుగా గుర్తిస్తూ, పోడు పట్టాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 128 జిల్లాల పరిధిలో 1,51,148 మంది లబ్దిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులని గుర్తించింది. వారందరికీ ఈ వానాకాలం సీజన్ నుండే రైతుబంధును కూడా అందించనున్నారు. గిరిజనులు అస్తిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గిరిజనులపై ప్రేమను, చిత్తశుద్ధిని చాటుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం.

ఈ సందర్బంగా పట్టాలు తీసుకున్న ప్రతి పోడు రైతుకు శుభాకాంక్షలు తెలిపారు విప్. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆరెస్ పార్టీ శ్రేణులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News