చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్. మందమర్రి మండలం ఆదిల్ పేట్ గ్రామంలో రెండు కోట్ల నిధులతో 42 సీసీ, మెటల్ రోడ్ల పనులకు విప్ బాల్క సుమన్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మిలు కలిసి శంకుస్థాపన ప్రారంభించారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పట్టణంలో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ సింగరేణి క్లబ్ లో ఈనెల 26వ తేదీన నిర్వహించే మెగా వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ ఎమ్మెల్యే బాల్క సుమన్. జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు.