Saturday, November 23, 2024
HomeతెలంగాణChennuru: చెక్కులు అందజేసిన విప్ బాల్క సుమన్

Chennuru: చెక్కులు అందజేసిన విప్ బాల్క సుమన్

శరవేంగంగా అభివృద్ధి చెందుతున్న క్యాతన్ పల్లి

చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వగృహంలో 357 మంది ఆడ బిడ్డలకు 3.57 కోట్ల విలువ గల కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు మహిళలకు వివరించారు.

- Advertisement -

నియోజకవర్గంలో 11 వేల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు అందజేశామన్నారు. ఒంటరి మహిళ పింఛన్లు – 12,259. వితంతు పెన్షన్లు – 786. బ్యాంకు లింకేజీ 2018 నుండి 32.17 కోట్లు జమచేయడం జరిగింది. వడ్డీ లేని రుణాలు – 2018 నుండి 3.36 కోట్లు,. సింగరేణి ఇండ్ల పట్టాలు – 3055,. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ – 11 వేలు,. 100 గ్రామాల్లో ఒక్కొక్క భవనానికి 18 లక్షలు వెచ్చించి 100 సమ్మక్క సారలమ్మ మహిళ భవనాలు,. చెన్నూరు మహిళా భవన్ కు 1.50 కోట్లు,. రామకృష్ణాపూర్ మహిళా భవన్ కు 2 కోట్లు,. మందమర్రి మహిళా భవన్ కు 2 కోట్లు కేటాయింపు,. 10 కోట్లతో చెన్నూరు పట్టణంలో మాతా శిశు సంక్షేమ దవాఖాన,. జిల్లాలో 4 ఆరోగ్య మహిళా సెంటర్లు,. నియోజకవర్గం మొత్తం మిషన్ భగీరథ-మొత్తం అమౌంట్ 128.63 కోట్లు,. మొత్తం గృహాలు – 61,948,. మొత్తం పైప్ లైన్ – 1073 KM. అభివృద్ధి పనులు చేశామన్నారు. అనంతరం విప్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు, కెసిఆర్ ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, మళ్లీ తెలంగాణలో మెరుగైన పాలన కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వమే రావాలి, విద్యా, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాల్లో అద్భుత పురోగతి సాధించాం. 28 కోట్లతో చెన్నూరు పట్టణంలో అంతర్గత రోడ్లు, డ్రైన్లు, 20 కోట్లతో మందమర్రి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైన్లు, 15 కోట్లతో క్యాతనపల్లి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తాం. చెన్నూరు బస్ డిపో పనులు త్వరలోనే మొదలవుతాయి. ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తున్నాము. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. గత పాలకులకు దోచుకోవడానికే సమయం సరిపోలేదు. చెన్నూరు నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. ఓట్లు వేసేదాకా ఓడ మల్లన్న.. వేసినాక బోడ మల్లన్న చందంగా గత ప్రభుత్వాలు పాలించాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను నమ్మొద్దు, వినద్దు, మోసపోవద్దు. పక్క రాష్ట్రాల ప్రజలు తెలంగాణ పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ గారికి వస్తున్న ఆదరణ చూసి విపక్షాలు భయపడుతున్నాయి. ఆకలి చావులు ఆత్మహత్యలు లేని తెలంగాణ పాలన దేశవ్యాప్తంగా కొనసాగాలి. కరోనా కష్ట కాలంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. తెలంగాణలోని అన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుస్తారు. కెసిఆర్ నాయకత్వంలో శక్తి మేరకు పనిచేస్తున్నాను. విపక్షాల విషయంలో.. ఎన్నికలకు సమయంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలి. ఆగం కావొద్దు. దేశానికే కేసీఆర్ నాయకత్వం వహించేలా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంగా చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News