Friday, November 22, 2024
HomeతెలంగాణCheryala: గోనెసంచుల్లేక నిలిచిన ధాన్యం కొనుగోలు

Cheryala: గోనెసంచుల్లేక నిలిచిన ధాన్యం కొనుగోలు

ముస్త్యాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే గోనెసంచుల కొరతను నివారించి నిలిచిపోయిన ధాన్యం వెంటనె కొనుగోలను చేపట్టాలని సిపిఎం పార్టీ చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో అన్నారు. మండలంలోని ముస్త్యాల గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం బృందం పరిశీలించి రైతులను వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోనె సంచులు లేక రైతుల ధాన్యం మ్యాచరు వచ్చినప్పటికీ కాంటాలు నిలిచిపోయాయని, అదేవిధంగా మార్కెట్లో అన్ని వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించలేదని ముఖ్యంగా ధాన్యాన్ని ఆరబోసుకునే ప్లాస్టిక్ పట్టాలు లేకపోవడం వల్ల ప్రతి రైతు ఈ ప్లాస్టిక్ పట్టాలను కిరాయిలకు తెచ్చుకోవడంతో ఒక్కో రైతు వెయ్యి నుండి 5000 వరకు నష్టపోతున్నారన్నారు. తాలుపట్టే మిషనరీలు సరిగా లేకపోవడం రిపేర్లతో కూడి ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యం ఏమాత్రం తరుగు పేరుతో కోత వేయకుండా వెంటనే సౌకర్యాలు కల్పించి, ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు పడుతూ నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రేపాక కుమార్, గుండ్ర రవీందర్, కొంగరి చంద్రమౌజుందార్, చింతల లింగం, రైతులు జగన్మోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి, జీవన్ రెడ్డి, శివాజీ, అంజిరెడ్డి, మల్లేశం, రేపాక లింగం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News