Thursday, April 3, 2025
HomeతెలంగాణCheryala: ఎమ్మెల్యే గో బ్యాక్.. ముత్తిరెడ్డికి నిరసన సెగ

Cheryala: ఎమ్మెల్యే గో బ్యాక్.. ముత్తిరెడ్డికి నిరసన సెగ

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరికి నిరసన సెగ తగిలింది. చేర్యాల మండలంలోని కడవర్గు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డిని తమ సమస్యలపై ప్రజలు నిలదీశారు. కడవెర్గు గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే ను గ్రామస్థులు అడ్డుకున్నారు. వాటర్ ప్లాంట్ పునరుద్దరణ చేయలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని.. ప్లాంట్ మూసివేసి సంవత్సరాలు గడిచినా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తమ సమస్య తీర్చలేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే తో వాగ్వాదం చేశారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా పంపించేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News