చేర్యాల మండలంలోని పలు గ్రామల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ తహసిల్దార్ ఎస్.కె ఆరిఫా, ఏపీఎం బాబురావులు ప్రారంభించారు. నాగపురి, పెద్దరాజుపేట గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ స్థానిక సర్పంచ్ నూనె వెంకటేశంలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతుల నుండి చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని రైతులకు సూచించారు. ముస్త్యాల గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రం మండల తహసిల్దార్ ఎస్.కె ఆరిఫా గ్రామ సర్పంచ్ పెడతల ఎల్లారెడ్డి లు ప్రారంభించారు. సర్పంచ్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద కు తీసుకురావాలని దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని అన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు వేచరేని ఏనుగుల దుర్గయ్య, తాడూరు నర్ర ప్రేమల మహేందర్ రెడ్డి, చిట్యాల ఎర్రబెల్లి రామ్మోహన్ రావు, ఆకునూరు చీపురు రేఖ మల్లేశం, రాంపూర్ దినేష్ తివారి, వీరన్నపేట కొండపాక బిక్షపతి, ఎంపీటీసీ శివశంకర్, చుంచనకోట గ్రామాల్లో ప్రభుత్వం ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు గ్రామ శాఖ నాయకులు రైతులతో కలిసి ప్రారంభించారు.