Friday, November 22, 2024
HomeతెలంగాణCheryala: అభివృద్దే ధ్యేయంగా కెసిఆర్ సంక్షేమ పథకాలు

Cheryala: అభివృద్దే ధ్యేయంగా కెసిఆర్ సంక్షేమ పథకాలు

సీఎం కేసిఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం

అభివృద్దే ధ్యేయంగా కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందని చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాలలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానిక న్యాయవాదులు,ప్రజలతో కలిసి సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అప్పటి నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో చేర్యాల నియోజకవర్గం కనుమరుగై పోయిందన్నారు. సీఎం కేసిఆర్ ఇక్కడి ప్రాంతంపై అవగాహనతో చేర్యాలను మున్సిపాలిటిగా ఏర్పాటు చేయడంతో పాటు చేర్యాల పట్టణ అభివృద్ధి కోసం సుమారు 70కోట్ల రూపాయలు, కొమురవెల్లి ఆలయ అభివృద్ధికి సుమారు 40 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని తెలిపారు. చేర్యాల ప్రాంత ప్రజల కోరిక మేరకు మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు జీవో జారీ చేశారని,ఇదే తరహాలో త్వరలోనే చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడో సారి రాష్ట్ర ప్రజలు సీఎం కేసిఆర్ కు పట్టం కట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News