Friday, November 22, 2024
HomeతెలంగాణCheryala: కాంగ్రెస్ మాయ మాటలు మోసపూరిత హామీలు నమ్మవద్దు

Cheryala: కాంగ్రెస్ మాయ మాటలు మోసపూరిత హామీలు నమ్మవద్దు

స్వార్థం కోసం కొమ్మూరి పార్టీలు మారిండు

కాంగ్రెస్ మాయ మాటలను నమ్మి మోసపోవద్దు మోసపూరిత హామీలతో ఆగం కావొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా కొమరవెల్లి మండలంలో కిష్టంపేట రామ్ సాగర్ గౌరాయపల్లి మర్రి ముత్యాల లేని నగర్ గ్రామాల్లో ప్రచారం గ్రామ గ్రామాన మహిళలు బతుకమ్మలు బోనాలతో స్వాగతం పలికి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కలిసి ప్రచారంలో పాల్గొంన్నారు.

- Advertisement -

ఈ సందర్బంగా మాట్లాడుతూ గృహలక్ష్మి, ఆసరా పింఛన్లు, కమ్యూనిటీ హాళ్లు,రోడ్ల కోసం నిధులు తెచ్చి బ్రహ్మండగా అభివృద్ది చేస్తా..బరాబరి ఓట్లు వేసి, ఏమైనా పనులు కావాలంటే కూడా బరాబరి మాతో కొట్లాడి పనులు తెచ్చే నాయకులు ఇక్కడ ఉన్నారు. కిష్టంపేట, చేర్యాల, కొమురవెళ్లి గ్రామాలన్నీ మీ సిద్దిపేట పక్కనే ఉన్నాయి..ఇక్కడ నుంచి రాకపోకలన్నీ సిద్దిపేటకు గజ్వేల్ కు ఉంటయి కదా. వాళ్లకు కావాల్సిన పనులు చూడాలె సార్ అని చెప్పగానే మొన్ననే రూ.60 కోట్లు ఇచ్చిండు..చేర్యాలకు 10 కోట్లు, జనగామకు రూ. 20 కోట్లు..మిగిలినవి గ్రామాల అభివృద్దికి ఇచ్చిన..ఆసరా పింఛన్లతో వృద్దులకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. 18 ఏళ్లు నిండిన వారందరికీ సౌభాగ్య లక్ష్మి కింది 3000 పింఛన్లు ఇస్తున్నారు.


చేర్యాల రెవెన్యూ డివిజన్ విషయాన్ని మొన్న జనగామ మీటింగ్ లో కేసీఆర్ సార్ ఇస్తానని స్పష్టం చేసిండు. మీ అందరి తరఫున సార్ కు ధన్యవాదాలు చెబుతున్నానీ తెలిపారు. మళ్లోసారి ముఖ్యమంత్రి ఈ నెల 18న చేర్యాలకు వస్తున్నాడు రెవెన్యూ డివిజన్ విషయాన్ని సార్ కు మళ్లోసారి గుర్తు చేద్దామన్నారు. మనం పథకాలు ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేస్తుంటే ఈ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ వాళ్లు..పథకాలను కేసీఆర్ అర్రాస్ పెడుతున్నడు అంటున్నరని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News