Friday, November 22, 2024
HomeతెలంగాణCheryala: పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ రద్దు చేసిన కలెక్టర్

Cheryala: పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ రద్దు చేసిన కలెక్టర్

ఈ ఘటనలు పునరావృతం కాకూడదని ఎంపీడీవోకు హెచ్చరిక..

చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పి.నవ్య అనే కార్యదర్శిని విధులలో నిర్లక్ష్యం వహిస్తుందని, సీనియర్ సిటిజన్స్ తో, అమర్యాదగా ప్రవర్తిస్తుందని, అసభ్యకరమైన పదజాలం వాడుతుందని చేర్యాల ఎంపీడీవో తారీక్ అన్వర్ గతంలో సస్పెండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ పై పూర్తి విచారణ జరిపిన తర్వాత ఎంపీడీవోకి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసే అధికారం లేదని, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు మాత్రమే ఉంటుందని, ఎంపీడీవో జారీ చేసిన సస్పెన్షన్ ను రద్దు చేస్తున్నట్లు, ఇకమీదటైనా ఎంపీడీవో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News