Friday, November 22, 2024
HomeతెలంగాణChevella: రోడ్లు ఊడ్చి నిరసన

Chevella: రోడ్లు ఊడ్చి నిరసన

సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ 17 నుంచి సమ్మె చేస్తున్న విఎఒలు సమ్మెలో భాగంగా రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. చేవెళ్ల మండల కేంద్రంలో వివోఏలు రోడ్లు ఊడ్చి నిరసన తెలియజేశారు. విఎఒలకు మద్దతు తెలిపిన సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ….గత 18 సంవత్సరాలుగా గ్రామాలలో విఎఒ లు మహిళల అభ్యున్నతికి మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి వారికి అవగాహన కల్పిస్తూ…లోన్ ఇప్పించి తిరిగి సక్రమంగా చెల్లించే విధంగా వివోఏలు మహిళలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలు పుస్తక రూపంలో నమోదు చేస్తూ ఎస్ హెచ్ జి లైవ్ మీటింగులు పెట్టి సంఘాలు ఆన్లైన్లో ఎంట్రి చేస్తున్నారన్నారు. మహిళా సంఘాల పనే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కాబట్టి వివోఎలా డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఒప్పుకోవాలని లేనిపక్షంలో సమ్మె విరమించేది లేదన్నారు. సమ్మెలో పాల్గొన్న వీఎవోలు మాట్లాడుతూ…గత 17 సంవత్సరాలుగా మేము చేస్తున్న శ్రమను ప్రభుత్వం గుర్తించాలన్నారు. చాలీచాలని వేతనాలతో ఇంతకాలం కుటుంబాన్ని నెట్టుకొచ్చామన్నారు. పిల్లలను వదిలి శాంతియుతంగా సమ్మె చేస్తున్న వీఐవోలను శ్రమను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఉన్నత అధికారులు మా బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా డిమాండ్లను నెరవేర్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏలు అందరు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News