Friday, November 22, 2024
HomeతెలంగాణChevella: చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం అవసరం

Chevella: చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం అవసరం

కాసాని తరుపున ఇంటింటి ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బిఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తరుపున పామెన, రేగడి ఘణాపూర్, దామరగిద్ద, ఇబ్రహీం పల్లి, గ్రామాలలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి పార్టీ మండల అధ్యక్షులు పెద్దొళ్ల ప్రభాకర్ అధ్యక్షతన పామెన మాజీ సర్పంచ్ అక్నాపురం మల్లారెడ్డి ఇబ్రహీంపల్లి మాజీ సర్పంచ్ మంజుల జంగారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేశారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థి కాసానిని గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. బీసీ ముద్దుబిడ్డ కాసానికి ఓట్లు వేసి గెలిపించుకోవలసిన అవసరం బహుజన సమాజంపై ఉందన్నారు. బీసీ సంక్షేమం కోసం 96 కులాలను ఏకం చేసి బీసీ ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేసిన ఘనత ఆయన అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనను గెలిపిస్తే పార్లమెంటులో బీసీల గొంతు వినిపిస్తది అన్నారు. జనాభాలో సగభాగమైన బీసీలకు సరైన న్యాయం జరగాలంటే చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు.

చేవెళ్ల గడ్డపై 15 సంవత్సరాలుగా రాని అవకాశం కేసిఆర్ బలపర్చిన కాసాని రూపంలో దక్కిందన్నారు. బీసీల గొంతు చట్టసభల్లో వినిపించినప్పుడే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. చేవెళ్ళ పార్లమెంట్ స్థానం ఏర్పడి 15 సంవత్సరాలు గడిచిన చేవెళ్ల ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బహుజన బిడ్డ కాసానిని చట్ట సభలకు పంపితే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు బీసీ ఎస్సి ఎస్టీలకు సమన్యాయం చేకూరుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మంగలి బాలరాజ్ మండలం ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి చేవెళ్ళ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింలు ఉద్యమ కారుడు శేరి రాజు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేష్, దేవరంపల్లి మాజీ సర్పంచ్ నరహరి రెడ్డి శ్రీనివాస్ గౌడ్ రాఘవేందర్ రెడ్డి రాజ్ కుమార్ కసిరి వెంకటేష్ ఎర్రోళ్ల మహేందర్ హరిప్ మియా రాములు అబ్దుల్ గని ఎల్లేష్ తోట చంద్రశేఖర్ కుమార్ రాజు గిరిధర్ రెడ్డి బేగరి నర్సింలు దండు సత్యం ఆయా గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News