చేవెళ్ళ మండల కేంద్రంలో ఈ నెల 23న చేవెళ్ల పార్లమెంట్ స్థాయిలో జరుగనున్న బిజెపి భారీ బహిరంగ సభకు స్థల పరిశీలన కోసం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వచ్చారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలు భారీ మెజారిటీతో గెలవాలనే సంకల్పంతో కేంద్ర నాయకత్వం పనిచేస్తుందన్నారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులను పార్లమెంట్ సభ్యులను ప్రతి పార్లమెంట్ కు ఇంచార్జిలుగా నియమించారన్నారు. దీనిలో భాగంగా నెలకు మూడు రోజులు నియోజకవర్గ ప్రజల కలిసి కార్యకర్తలతో సమావేశమై పార్టీ విస్తరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకు వివరించాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి వచ్చాక పార్టీ బలోపేతమైందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలువాలని అమిత్ షా నేరుగా పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఈ ప్రాంతంలో మంచి క్యాడర్ ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభకు గ్రామల నుంచి పెద్ద ఎత్తున్న ప్రజసమీకరణ చేసి సభను విజయవంతం చేయాలన్నారు. సభా ప్రాంగణంలో కార్యకర్తలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తునమన్నారు. ఈ కార్యక్రమంలో కాంజర్ల ప్రకాష్ వర్రీ విజయ్ కుమార్ తులసి రామ్ వెంకట్ రెడ్డి పాండు రంగారెడ్డి కుంచంశ్రీను అనంతరెడ్డి వెంకట్ రాంరెడ్డి కృష్ణగౌడ్ సింగపురం రమేష్ అశోక్ నితీష్ రెడ్డి పత్తిసత్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి శేఖర్ రెడ్డి రంజిత్ వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.