పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై మొట్టమొదటిసారిగా కమలం పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. 23 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాలు మొదటి రౌండ్లో 6వేల 800 వందలు ఆధిక్యంలో నిలిచి 24వ రౌండ్ వరకు ప్రతి రౌండ్ లో తన ఆదిఖ్యతను చాటుకున్నారు. 24 రౌండ్ల ఈవీఎం ఓట్ల లెక్కింపు ముగిసే సరికి లక్ష 67వేల 778 ఓట్ల మెజారిటీ సాధించారు. చేవెళ్ల పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో (చేవెళ్ల రాజేంద్రనగర్ శేరిలింగం పల్లి ఇబ్రహీంపట్నం పరిగి వికారాబాద్ తాండూర్) ఈవీయంలో పోలైన ఓట్లు 16లక్షల 55వేల193 పోలవ్వగా పోస్టల్ బ్యాలెట్ 19,397 ఓట్లు కాగా మొత్తం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో 16లక్షల 75వేల 572 ఓట్లు పోలయ్యాయి. చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం సెగ్మెంట్లో మొత్తం పోలైన ఓట్లలో ప్రధాన 3పార్టీల అభ్యర్థుల వారిగా బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఈవీఎం ఓట్లు 1,77,540 పోస్టల్ బ్యాలెట్1428 కలిపి లక్ష 78వేల 968 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. గడ్డం రంజిత్ రెడ్డికి ఈవీఎం ఓట్లు 6,30,861 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 6,124 కలిపి మొత్తం 6,36,985 ఓట్లు పోలయ్యాయి. బిజెపి పార్టీ చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఈవీఎం ఓట్లు 7,98,517 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 11,367 పోలై మొత్తం 8లక్షల 9వేల 882 ఓట్లు పోలయ్యాయి. ఈ మొత్తం లక్ష 72 వేల 897 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నోటాకు 6వేల 308 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ 19వేల 397 ఓట్లు పోలవ్వగా 221 ఓట్లు తిరస్కరించబడ్డాయి. ఇందులో చెల్లని ఓట్లు 110 ఉన్నాయి.
చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ఎన్నికల్లో గెలుపొందిన పత్రాన్ని అందజేశారు. ఆనందోత్సవాల్లో బిజెపి శ్రేణులు బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందాడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు స్వీట్లు తినిపించుకొనిసంబరాలు జరుపుకున్నారు.
ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్ అభ్యర్థి డా.గడ్డం రంజిత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డా. గడ్డం రంజిత్ రెడ్డి అధికారులు మీడియా పాయింట్ వద్ద 10వ రౌండ్ ఫలితాలు తెలుపగా కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చి తన ఓటమిని అంగీకరించారు. హైదరాబాదులో బిజెపికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయన్నారు. ఎన్నికల్లో తమ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో బిజెపి వేవ్ నడవడమే ఓటమికి కారణమని మరి ఇతర కారణాలు లేవు అన్నారు.