Sunday, November 16, 2025
HomeTop StoriesChevella Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!

Chevella Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!

chevella bus Accident: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతిచెందారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తనుషా, సాయి ప్రియ, నందిని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతులు తాండూరు వడ్డెర గల్లీకి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లు సైతం చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి సైతం ఉన్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు.

తాజాగా పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు:

- Advertisement -

1.దస్తగిరి బాబా, డ్రైవర్‌
2.తారిబాయ్ (45), దన్నారమ్ తండా
3.కల్పన(45), బోరబండ
4.బచ్చన్‌ నాగమణి(55); భానూరు
5.ఏమావత్‌ తాలీబామ్‌, ధన్నారం తాండ
6.మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్ మండలం
7.గుర్రాల అభిత (21) యాలాల్‌
8.గోగుల గుణమ్మ,బోరబండ
9.షేక్‌ ఖాలీద్‌ హుస్సేన్‌, తాండూరు
10.తబస్సుమ్‌ జహాన్‌, తాండూరు
11. తనూషా, సాయిప్రియ, నందిని(ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు)
12. అఖిల(తాండూరు)
13. ఏనుగుల కల్పన
14. నాగమణి
15. జహంగీర్‌

క్షతగాత్రులు: 
  • వెంకటయ్య
  • బుచ్చిబాబు-దన్నారమ్‌ తండా
  • అబ్దుల్‌ రజాక్‌-హైదరాబాద్‌
  • వెన్నెల
  • సుజాత
  • అశోక్‌
  • రవి
  • శ్రీను- తాండూరు
  • నందిని- తాండూరు
  • బస్వరాజ్‌-కోకట్‌ (కర్ణాటక)
  • ప్రేరణ- వికారాబాద్‌
  • సాయి
  • అక్రమ్‌-తాండూరు
  • అస్లామ్‌-తాండూరు
సహాయక చర్యల ముమ్మరం: ఘటనా స్థలిలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘోర ప్రమాదంపై సమన్వయం కోసం సెక్రటేరియట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాలకు అందించేందుకు, సహాయక చర్యలను అధికారులతో సమన్వయం చేసేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.
సహాయక సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
  • ఏఎస్ (AS) నంబర్: 9912919545
  • ఎస్‌ఓ (SO) నంబర్: 9440854433
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad