Saturday, October 5, 2024
HomeతెలంగాణChevella: అంగన్వాడీలూ.. ఛలో ఇందిరా పార్క్

Chevella: అంగన్వాడీలూ.. ఛలో ఇందిరా పార్క్

సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఛలో ఇందిరాపార్కు అంటూ… ధర్నాకు పయనమయ్యారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ ఆధ్వర్యంలో చేవెళ్ళ నుంచి అంగన్వాడి టీచర్లు పెద్ద సంఖ్యలో బయలు దేరారు. ఈ సందర్భంగా అల్లి దేవేందర్ మాట్లాడుతూ…. గత 40 సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్లు ఐసీడీఎస్ లో పనిచేస్తున్న వారికి ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం ప్రభుత్వం అమలు చేయక పోవడం బాధాకరం అన్నారు. ఎన్ హెచ్ టీఎస్ యాప్ ను రద్దు చేయాలనే డిమాండ్లతో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అంగన్వాడీ సమస్యలపై చాలామంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారన్నారు. కానీ చేవెళ్ల ఎమ్మెల్యే మాత్రం అంగన్వాడీ ఉద్యోగుల గూర్చి మాట్లాడలేదని వారు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎవరు కృషి చేస్తే వారికి రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ల యూనియన్ మహిళా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News