Saturday, October 5, 2024
HomeతెలంగాణChevella: ముగిసిన 'సిఎం కప్' 2023 టోర్నమెంట్

Chevella: ముగిసిన ‘సిఎం కప్’ 2023 టోర్నమెంట్

ప్రభుత్వం మూడు రోజుల పాటు నిర్వహించిన సిఎం కప్ ముగిసింది. గెలిచిన విజేతలకు స్థానిక శాసన సభ్యులు కాలె యాదయ్య బహుమతులు అందజేశారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలలో దామరగిద్ద జట్టుకు వాలీబాల్ పోటీలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది. ద్వితీయ బహుమతి ఆలూరు గ్రామం దక్కించుకుంది. కబడ్డీలో పాల్గొన్న పామెన జట్టు మొదటి బహుమతి పొందింది. కబడ్డీ రెండవ స్థానం ఆలూరు జట్టుకు దక్కింది. షార్ట్ పుట్ లాంగ్ -జంప్ 100 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనపరిచిన యువకులను ఆయన అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆటలో గెలుపు ఓటములు సహజమని రెండింటిని సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడలతో మనిషికి మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం కలుగుతుందన్నారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించాలనే దృక్పథంతో సీఎం కప్ టోర్నమెంట్ ను ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దల ప్రభాకర్ పామెన సర్పంచ్ అక్నాపురం మల్లారెడ్డి ఉప సర్పంచ్ విజయ్ దామరగిద్ద సర్పంచ్ మలిపెద్ది వెంకటేశం గుప్తా అల్లాడ ఎంపీటీసీ సత్యనారాయణ ఆలూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు తోట శేఖర్ చేవెళ్ల ఏఎంసి చేవెళ్ల డైరెక్టర్ మమ్మద్ ఫయాజుద్దీన్ అధికారులు చేవెళ్ల తాసిల్దార్ వై ఎస్ శ్రీనివాస్ ఎంపీడీవో రాజ్ కుమార్ ఎంపీవో విట్టళేశ్వర్ ఎంఈఓ సయ్యద్ అక్బర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పిఇటి శ్రీనివాసరావు, విలేజ్ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News