ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెండింగ్ పనులను పూర్తిచేసి 2023- 24 అకాడమిక్ ఇయర్ ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఏడాది డిగ్రీ కాలేజ్ ప్రారంభించకపోతే పోరాటం చేస్తామని టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి సున్నం వసంతం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. చేవెళ్ల నుంచి ఇద్దరు జిల్లా మంత్రులైన రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ దిక్కులేదన్నారు. విద్యాశాఖ మంత్రి హయాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్తికాకపోవడం విడ్డూరమన్నారు. దశాబ్ది ఉత్సవాలకు105 కోట్ల ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ పార్టీ నాయకులు జాల్సాలు చేసుకునేందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.ఉత్సవాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
సున్నపు వసంతం మాట్లాడుతూ… తెలంగాణలో అసమర్థత పాలన జరుగుతుందన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ కు సెంటిమెంట్ అని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మంత్రి, ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ఇన్నేళ్లు గడుస్తున్న పూర్తి ఎందుకు కాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పూర్తి చేసి విద్యార్థులకు విద్యనిందించాలని డిమాండ్ చేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫైర్ స్టేషన్ ప్రారంభించమన్నారు. ఏం అభివృద్ధి చేశారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేను మల్లి గెలిపించాలనే 111 జీవో తెరమీదకి తీసుకొచ్చారన్నారు. చేవెళ్లలో అంబేద్కర్ భవనం,టీటీడీ కళ్యాణ మండపం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Chevella: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించాలని కాంగ్రెస్ ధర్నా
కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి