Saturday, November 23, 2024
HomeతెలంగాణChevella: దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ

Chevella: దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ

బర్లు గొర్లతో కురుమల భావితరాలు నాశనం

చేవెళ్ల మండల కేంద్రం శంకర్పల్లి చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరించారు. రజాకర్లు దేశ్ముఖులు దొరలు జమిందార్ల దుర్మార్గాలు, దురాగతాలను సహించలేక వారిపై వీరోచితంగా పోరాడి అమారుడైన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో బలిదానాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రైతాంగ, సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డు కొమరయ్య అన్నారు. రజకర్ల దురాగతాల దుర్మార్గాలపై వీరోచితంగా పోరాడిన మహా ధైర్యశాలి కొమరయ్య అన్నారు. ఆయన తెలంగాణ సాధనకు కృషి చేశారన్నారు. కురుమలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. సమాజంలో గౌరవం దక్కాలన్నా గౌరవప్రదమైన జీవనం గడపాలంటే విద్యతోనే సాధ్యం అన్నారు. కురుమల విద్య, ఆర్థికాభివృద్ధి జరగాలంటే ప్రతి జిల్లాలో కురుమ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్నారు. టెక్నాలజీతో ముందుకు సాగాలన్నారు. బర్లు గొర్లతో భావితరాల విద్య సాకారం కాదన్నారు. ప్రాచీన కళలను కాపాడుతున్న ఒగ్గు కళాకారుల్లో మంచి నైపుణ్యం ఉంటుందన్నారు. వారిని కాపాడుకోవాలసిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా ఎదిగినప్పుడే సామాజిక తెలంగాణ సహకారం అవుతుందన్నారు. దొడ్డి కొమరయ్య ఆశయాలకు చేయూతనివ్వాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం క్యామ మల్లేష్ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గె మల్లేష్ గ్రామ సర్పంచ్ బండారు శైలజ ఆగిరెడ్డి జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం ఎంపిటిసి గుండాల రాములు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అత్తేలి అనంతరెడ్డి వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కురుమ సంఘాలవారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News