చేవెళ్ళ ముల్సిపల్ లో మా గ్రామాన్ని కలపొద్దని దేవుని ఎర్రవల్లి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు బేగారి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు గ్రామంలోని ప్రతి వాడవాడ తిరుగుతూ…’మున్సిపల్ మాకు వద్దు గ్రామ పంచాయితీ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ… మున్సిపల్ ను వ్యతిరేకించారు. యువకులతో కలిసి గ్రామస్తులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థి నాయకులు అరుణ్ మాట్లాడుతూ… నూతనంగా చేవెళ్ల మండలాన్ని మున్సిపా లిటీగా ఏర్పాటు చేస్తున్న క్రమంలో దేవుని ఎర్రవల్లి గ్రామం కూడా మున్సిపాలిటీలో కలుస్తుందని తెలిసి ‘మేము ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. మా ఊరిని మున్సి పాలిటీలో చేరిస్తే ఊరుకునేది లేదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సర్పంచ్, ఎంపీపీ ఎవరిని అడిగి మున్సిపలిటీలో చేర్చడానికి అంగీకరించారో గ్రామప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. గద్దేనెక్కడానికి మా ఓట్లు కావాలి కానీ ఇలాంటి సందర్భాల్లో ‘మా’ అభిప్రాయం తీసుకోరా..!అని గ్రామ సర్పంచ్ ఎంపిటిసిల పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎంపిటిసి చంద్రయ్య, మాజీ సర్పంచ్ అంజయ్య , చేవెళ్ల బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తి సత్యనారాయణ , శ్రీనివాస్, రాజు రవీందర్, శివయ్య, విట్టల్ రెడ్డి, కరికే శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు,రమేష్, మల్లేష్ , గోపాల్, శ్రీశైలం గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు సర్పంచ్ ఎంపిటిసి చింపుల సత్యనారాయణ పాల్గొన్నారు.