Saturday, November 23, 2024
HomeతెలంగాణChevella: ఎక్సైజ్ శాఖాధికారుల ఆకలి గోడు

Chevella: ఎక్సైజ్ శాఖాధికారుల ఆకలి గోడు

సీఎం సారూ.. జర అబ్కారీపై నజర్ పెట్టుర్రి

తెలంగాణ రాష్ట్రంలో 2023 ఏడాది శాసనసభ ఎన్నికలు పూర్తయిన స్థానిక సంస్థల ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు వెనివెంటనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2023- 24 సంవత్సరానికి వైన్ షాపుల టెండర్ ప్రకటించింది. ఆశవాహులు ఒక టెండర్లకు వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకోగా పోటీల్లో నెగ్గెందుకు పదుల సంఖ్యలో టెండర్లు వేసి ప్రభుత్వ ఖజానాను నిండుగా నింపిండ్రు. లాటరీ విధానం ద్వారా టెండర్ దక్కించుకున ఆశవాహుల ముఖంలో సంతోషం వెళ్ళువిరిసింది. నిర్ణీత ధరకు మద్యం అమ్మిన ఎంతో కొంత లాభం వస్తుందన్న ధీమాతో లక్షల రూపాయలు వెచ్చించి వైన్స్ షాపులు ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలకు సహకరించాల్సిన శంషాబాద్ డివిజన్ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చిన లాభాలను గద్ద వచ్చి కోడి పిల్లను ఎత్తుకుపోయినట్లు బొట్టు బొట్టు అమ్మి కూడబెట్టిన సొమ్ము ఎత్తుకు పోతుండ్రు.

- Advertisement -

విశ్వాసనీయ సమాచారం ప్రకారం గత ఏడాది టెండర్లు దక్కించుకున్న వారు ఒక వైన్ షాప్ కు 50 వేలు ఆబ్కారీ అధికారులకు ముట్ట చెప్పే వారమని, 2023-24 ఎన్నికల ఏడాది కావడంతో మద్యం షాపులో టెండర్ దక్కించుకున్న వారి దగ్గరకు ఉన్నతాధికారులు వారి కింది స్థాయి సిబ్బందిని పంపి ఒక్కో షాపుకు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని వైన్ షాప్ ఓనర్లు లబోధిబోమంటున్నారు. పోటీలో నెగ్గడానికి నానా కష్టాలు పడి లక్షలు వెచ్చించగా టెండర్ దక్కడంతో అదృష్టం వరించిందనుకున్న యజమానుల ఆశలు కాస్త అడియాశలైతున్నాయి. వచ్చిన లాభాలలో లక్షలు అధికారులకు ఇచ్చి షాపు నిర్వాహనలో పని చేస్తున్నవారికి జీతాలు ఇవ్వలేక పోతున్నామని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేక బయట చెప్పలేక ఆవేదన చెందుతున్నారని సమాచారం.

గౌడన్నలను సైతం వదలని అధికారులు

పకృతిలో లభించే సహజసిద్ధమైన కల్లు రుచిని పసిగట్టి చెట్టు చనిపోకుండా చెట్టు సిగల గీత గీసి కల్లు తీయడం ఒక గీత కార్మికునికే సాధ్యం. చెట్టు నుంచి లభించే ఈ కల్లే వారి కుటుంబాలకు జీవనాధారమైంది. గత ప్రభుత్వాలు ప్రకృతిలో భాగమైన చెట్లపై గౌడన్నల్లకున్న చాతుర్యం మనిషి ఆరోగ్యానికి స్వచ్ఛమైన కల్లు చేసే మేలు గుర్తించి అమ్మడానికి అనుమతిలిచ్చింది. గౌడ్ అన్నలు అమ్మిన పెట్టెలను లెక్కించి ఎన్ని పెట్టెలు అమ్మితే అంత కమీషన్ ఇవ్వమని అబ్కారీ అధికారులు దిగజారుడుతనానికి నిదర్శనం. గౌడన్నలపై కిందిస్థాయి అధికారుల జులుం పెరగడంతో ఉన్నతాధికారులకు గౌడ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఖజానా నింపేందుకు మహాలక్ష్మిగా పేరొందిన ఆబ్కారి శాఖ  కొందరి అధికారుల దిగజారుడు తనం వల్ల శాఖకు చెడ్డ పేరు వస్తుంది. ఉన్నత అధికారులు దీనిపై దృష్టి సాధించి. ఇంతకు దిగజారుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు పరోక్షంగా తమ బాధలను వెల్లబోసుకుంటున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News