Thursday, April 17, 2025
HomeతెలంగాణChevella: పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు కొండా మద్దతు

Chevella: పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు కొండా మద్దతు

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు భారతీయ జనత పార్టీ మద్దతు ఉంటుందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సమ్మెలో పాల్గొన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి పూర్తి మద్దత్తు ఉంటుందని కార్యదర్శులకు హామీ ఇచ్చారు. చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తమ ఉద్యోగాలను న్యాయబద్ధంగా పర్మినెంట్ చేయాలని సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం సబబుకాదన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. చట్టపరంగా సమ్మె చేస్తే పంచాయతీ జూనియర్ కార్యదర్శులపై ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. ఉద్యోగుల కార్మికుల హక్కులు వారికి దక్కకపోతే సమ్మె చేయడం ఉద్యోగుల హక్కు అన్నారు. చట్టపరంగా ఉద్యోగులకు జరగాల్సిన న్యాయం దక్కాలన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడం సరికాదన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మద్దతు తెలిపిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు చేవెళ్ల భాజపా మండల ప్రధాన కార్యదర్శి అతెల్లీ అనంత్ రెడ్డి తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News