Saturday, November 15, 2025
HomeతెలంగాణChevella Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియా .....

Chevella Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియా .. కేంద్ర పరిహారం ఎంతంటే?

Chevella rtc bus Accident Updates: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు-టిప్పర్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా (పరిహారం) ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన ప్రతీ కుటుంబానికి మొత్తం రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు కేటాయించగా.. ఆర్టీసీ తరఫున రూ. 2 లక్షలు కేటాయించినట్టుగా తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్టుగా తెలిపారు. మృతులందరికీ చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలోనే పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్టుగా మంత్రి పొన్నం వెల్లడించారు.
కేంద్ర పరిహారం ఎంతంటే: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున అందిచనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad