Saturday, November 15, 2025
HomeతెలంగాణChevella Bus Accident: ఐదు నిమిషాల ఆలస్యం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు మృత్యు శాపం.. తీరని కన్నీటి...

Chevella Bus Accident: ఐదు నిమిషాల ఆలస్యం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు మృత్యు శాపం.. తీరని కన్నీటి గాథ 

Chevella Bus Accident Three Sisters Death Emotional Story: నలుగురు ఆడపిల్లలు సంతానం.. చేసేది డ్రైవర్‌ ఉద్యోగం.. అయితేనేం ఇవేమి ఆ కన్నవాళ్లకి బాధ కలిగించలేదు. ఒక్కొక్కరిగా భారం దించుకోవడానికి చదువులు ఆపి పెళ్లిళ్లు చేయలేదు. ఉన్నంతలో సంసారం నెట్టుకొస్తూ నలుగురు ఆడపిల్లలనూ వారు కోరుకున్నంత చదివించాలని నిర్ణయించుకున్నారు. వైభవంగా పెద్ద కూతురు వివాహం చేశారు. తన కూతురిని అత్తారింటికి సాగనంపానన్న సంతోషం తప్ప అప్పులయ్యాయనే బాధ లేదు. మిగతా ముగ్గురు కూతుళ్లనూ అలాగే ఉన్నతంగా తీర్చిదిద్ది వారి విజయాన్ని కళ్లారా చూడాలనుకున్నారు. కానీ ఇలా.. రోడ్డుపై కంకర మధ్య నెత్తుటితో నిండిన కన్న కుమార్తెల చితికిన దేహాలను చూసి తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. ఈ ఘోరం చూడటానికా మేము పిల్లలను కన్నది అని వారు రోదిస్తున్న తీరు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేసింది.

- Advertisement -

సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ముగ్గురు బిడ్డల మరణంతో ఆ తల్లిదండ్రులకు అంతులేని విషాదం మిగిలింది. కొన్ని రోజుల క్రితమే బంధువుల పెళ్లిలో మహాలక్ష్ముల్లాగా అలంకరించుకుని.. నిన్నటి వరకు ఇంట్లో అమ్మా నాన్న అంటూ వారి వెనకాలే తిరిగిన తమ ముగ్గురు కూతుళ్లు ఈ రోజు రక్తపు ముద్దల్లాగా పడి ఉండటం చూసి వారు గుండెలు బాదుకుంటున్న తీరు వర్ణనాతీతం. నా పిల్లలు లేకుండా నేను బతికేదెలా.. నా పిల్లల్ని నాకు ఇవ్వు దేవుడా అంటూ ఆ తల్లి రోదన గుండెల్ని పిండేస్తుంది. 

Also Read: https://teluguprabha.net/national-news/jaipur-road-accident-died-10-members/

వికారాబాద్‌ జిల్లా తాండూరు వడ్డెర గల్లీకి చెందిన ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ పని చేస్తున్నాడు. ఆయనకు నలుగురు కూతుళ్లు.. పెద్ద కుమార్తె వివాహం చేశారు. మిగతా ముగ్గురు కూతుళ్లు తనూషా, సాయి ప్రియా, నందిని హైదరాబాద్‌లోని కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. పెళ్లి వేడుక కోసం గతనెల 17న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఊరికి వచ్చారు. ఇన్ని రోజులు కుటుంబీకులతో సంతోషంగా గడిపారు. పరీక్షలు ఉండటంతో ఈరోజు ఉదయం ట్రైన్‌లో సిస్టర్స్‌ హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ ఇక్కడే దురదృష్టం వారిని వెంటాడింది. మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. 

కేవలం ఐదు నిమిషాల ఆలస్యంతో ట్రైన్ మిస్ అయింది. దీంతో తండ్రి ముగ్గురిని తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు ఎక్కించారు. కానీ అదే తమ పాలిట యమపాశం అవుతుందని వారు ఊహించలేదు. ఐదు నిమిషాల ఆలస్యం వారి జీవితాలనే చీకటిగా మార్చింది. కూతుళ్లను బస్సు ఎక్కించి.. ఇంటికి వెళ్లి ఓ కునుకు తీసిన ఎల్లయ్య గౌడ్‌కు ఇంతలోనే గుండె పగిలే వార్త. 

Also Read: https://teluguprabha.net/telangana-news/chevella-bus-accident-updates-2/

ఉదయం 4.40 గంటల ప్రాంతంలో తాండూరు నుంచి బయలుదేరిన బస్సు చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని ఎల్లయ్య గౌడ్‌ దంపతులు షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో తమ ముగ్గురు కూతుళ్లు చనిపోవడంతో ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. ఏ కన్నవారికి ఇలాంటి కడుపుకోతను ఇవ్వకు భగవంతుడా అంటూ విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad