Saturday, November 23, 2024
HomeతెలంగాణChevella: పల్లెలు సింగారం-తెలంగాణ బంగారం

Chevella: పల్లెలు సింగారం-తెలంగాణ బంగారం

చేవెళ్ల గ్రామపంచాయతీ త్వరలో మున్సిపాలిటీ కాబోతుంది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో “పల్లె ప్రగతి” దినోత్సవం చేవెళ్ల గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రగతి దినోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎంపి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ…నాడు పల్లెల్లో పల్లెర్లు మొలిచాయని రాష్ట్రము ఏర్పడ్డాక పల్లెల్లో ప్రకృతి వనాలు వెల్లువిరిశాయన్నారు. తెలంగాణ పల్లెలు సింగారం స్వరాష్టం బంగారం అన్నారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మకులకు సన్మానించి మెంమోటోలు అందించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి పరిశుధ్య పని చేసిన కార్మికుల సేవలను కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. ఇకపై చేవెళ్ల గ్రామపంచాయతీ త్వరలో మున్సిపాలిటీ కాబోతుందని కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ… దశాబ్ది స్వయం పాలనలో పల్లెకు అదృష్టం సిఎం కేసిఆర్ నాయకత్వం అన్నారు. ‘‘పల్లె కన్నీరు పెడుతోంది.. కనిపించని కుట్రల, నా తల్లి బంధి ఐపోతుందో కనిపించని కుట్రల’’ అన్న పాటకు కాలం చెల్లిందన్నారు. దేశంలో పల్లెలున్న రాష్ట్రంగా అవార్డులు పొందుతున్న ఘనత పల్లెలదన్నారు. ప్రతి ఊరుకు హరితహారం, నర్సరీ, డంపింగ్ యార్డు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, వైకుంఠధామలు, క్రీడా స్థలాలు, మిషన్ భగీరథ నీళ్లు విద్యుత్ తో వెలుగుల వాకిల్లు పల్లెలు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశలవారీగా పల్లె ప్రగతి కార్యక్రమాలుంటాయిన్నారు. చేవెళ్ల గ్రామ పంచాయతీలో బోనాల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. పల్లె ప్రగతి కార్యక్రమం అనంతరం పల్లె ప్రకృతివనంలో వనభోజనాలు నిర్వహించారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజ ఆగిరెడ్డి ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి జెడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపిటీసి సున్నపు వసంతం పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ ఉప సర్పంచ్ గంగి యాదయ్య మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శీను ఫయాజుద్దీన్ మహ్మద్ గని జూకన్న గారి జైపాల్ వార్డ్ సభ్యులు సోషల్ మీడియా అధ్యక్షులు పొట్ట దయాకర్ అధికారులు తాసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో ఐకెపి సిబ్బంది ఆశ వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News