బలిదాన దివస్ సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. బిజెపి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ బండారి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెక్ పెట్టారన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ రద్దు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు అదెట్లా శ్రీనివాస్ కుంచం శ్రీనివాస్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు శరవలింగం కృష్ణ గౌడ్ బిజెపి నాయకులు కృష్ణారెడ్డి చాకలి శ్రీనివాస్ రవీందర్ బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తి సత్యనారాయణ బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు చేగూరి ప్రవీణ్ రెడ్డి కృష్ణమోహన్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ మధుకర్ రెడ్డి బీజేవైఎం నాయకులు జై సింహా రెడ్డి శ్రీనాథ్ రెడ్డి వడ్డే గణేష్ విష్ణు రంజిత్ హరి శంకర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జనసంఘ్ వ్యవస్థాపకుడు బలిదాన్ దివస్ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీకి మొయినాబాద్ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా మొయినాబాద్ పట్టణ కేంద్రంలో ప్రధాని మోడీ తొమ్మిది ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేసారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోర నర్సింహారెడ్డి, ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు అశోక్ యాదవ్, యువమోర్చా మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్, భారతీయ జనతా పార్టీ మండల కోశాధికారి ప్రభు యాదవ్, సీనియర్ నాయకులు వీరారెడ్డి , రవిందర్రెడ్డి వన్నాడ శివకుమార్, ఎల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.