చేవెళ్ల మండల కేంద్రంలో విఒఎలు విధులు బహిష్కరించి, దీక్షకు దిగారు. వీరికి మద్దతు ప్రకటించారు సిఐటియు జిల్లా సహాయకార్యదర్శి. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్థాయిలో విఒఎలు తక్కువ వేతనంతో పని చేస్తున్నారన్నారు. పలుమార్లు వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన మార్చి 16, 17, 18 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు టోకెన్ సమ్మె చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. వారికి ఆన్లైన్ వర్క్ విపరీతంగా పెంచుతున్నారన్నారు. ఏండ్ల తరబడి పనిచేస్తున్నా శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం సెర్ఫ్ సిబ్బందికి వేతనాలు పెంచడం చాలా సంతోషం అన్నారు. కాని విఒఎలకు కనీస వేతనం అమలు చేయలేకపోవడం బాధాకరమ్మన్నారు.
గత్యంతరం లేక సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించి సెర్ఫ్ గుర్తింపు కార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం నాయకులు చంద్రశేఖర్ సునీత జ్యోతి విఒఎలు పాల్గొన్నారు.