పదవి లేకున్న పార్టీ కోసం పని చేస్తానన్నారు చేవెళ్ళ నియోజకవర్గ యూత్ మాజీ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్ రెడ్డి. బిఆర్ఎస్ పార్టీలో 8 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పని చేశానని లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పని చేశానని తమకు సమాచారం ఇవ్వకుండా పదవి నుంచి తొలగించడం బాధ కలిగించిందన్నారు. పదవులు శాశ్వతం కావని, పదవులు ప్రజలు నిర్ణయిస్తారన్నారు. ఎమ్మెల్యే తమకు సమాచారం ఇస్తే బాగుండేదన్నారు. 111 జిఒ విషయంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కలిసిన సందర్భంలో కూడా తమకు సమాచారం లేదన్నారు. 111 జిఓ ఎత్తేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపమన్నారు. కెసిఆర్ కెటిఆర్ ఏపనిచ్చినా చేస్తామన్నారు. ఎంఎల్ సి పట్నం మహేందర్ రెడ్డి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం అందరి ఆశీస్సులు తమకు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే తనను సడన్గా పదవి నుంచి తొలగించడానికి కారణమేంటో తెలియదన్నారు. పదవి నుండి ఎందుకు తీశారని విలేకరులు ప్రశ్నించగా పదవి ఎందుకు తీసేశారో తాను అడగలేదన్నారు. తీయడానికి కారణం ఎమ్మెల్యేనే చెప్పాలన్నారు. బిఆర్ఎస్ లో రెండు వర్గాలా అని జర్నలిస్టులు ప్రశ్నించగా కెసిఆర్ పార్టీ బిఆర్ఎస్ అని పార్టీలో వర్గాలు లేవన్నారు. తమ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో మొయినాబాద్ మండలం మాజీ ఎంపీటీసీ యాదయ్య నవాబ్ పేట్ మండలం అక్నాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్, గౌస్ బాయ్ రాంచందర్, శంకర్పల్లి మండలం మహేందర్ రెడ్డి, శీను చేవెళ్ల మండలం సర్పంచు లక్ష్మయ్య, సర్పంచ్ భాస్కర్, మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ మదన్ షా, బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్, ఎస్ మహిపాల్ రెడ్డి కె విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.