Konda Surekha issue: బుధవారం అర్ధరాత్రి నుంచి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అంశంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షాడో మంత్రిగా ఉంటూ అధికారులను బెదిరిస్తున్నాడనే ఆరోపణలతో సుమంత్‌ను ఓఎస్డీ నుంచి కాలుష్య నియంత్రణా మండలి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
ఆర్‌అండ్‌బీకి మేడారం జాతర పనుల రికార్డులను వెంటనే అప్పగించాలని మంత్రి కొండా సురేఖను ఆదేశించారు. అంతే కాకుండా మేడారం జాతర అభివృద్ధి పనులను రోడ్లు-భవనాల శాఖకు అప్పగిస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగానే రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read:https://teluguprabha.net/telangana-news/konda-sushmita-patel-hot-comments-on-cm-revanth-reddy/


