Sunday, September 8, 2024
HomeతెలంగాణChigurumamidi: పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్న కేసీఆర్

Chigurumamidi: పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్న కేసీఆర్

చిగురుమామిడి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు 21,02,436 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను 21 మంది లబ్దిదారులకు మరియు సీఎం సహాయ నిధి నుండి మంజూరైనా రూ.4 లక్షల 78 వేల విలువ గల CMRF చెక్కలను 19 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 11వేల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఒక్క చిగురుమామిడి మండలంలో ఇప్పటివరకు 14 కోట్ల 17 లక్షల 71 వేల 604 రూపాయల విలువగల చెక్కులను 1501 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేయడం జరిగింది.అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారు అని అన్నారు. అంతకుముందు సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గం అధ్యక్షులు గందే సంపత్ తో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ మాట్లాడుతూ మరో తిరుమల తిరుపతి దేవస్థానం వలే సుందరగిరి దేవస్థానానికి సైతం నలుమూలల నుండి భక్తులు రావడం జరుగుతుందని ఈ దేవస్థాన అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తామన్నారు త్వరలోనే దేవస్థానంలో కళ్యాణమంటపం ఏర్పాటుతోపాటు ఘాట్ రోడ్ నిర్మాణం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు చిగురుమామిడి మండల కేంద్రంలో పాల ఉత్పత్తి దారుల సంస్థ నూతన భవనాన్ని కరీంనగర్ డైరీ సంస్థ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. పాడి పరిశ్రమకు గ్రామాల్లో కరీంనగర్ డైరీ ఎంతో కృషి చేస్తుందని కళ్యాణానికి పుస్తె మట్టలు చదువుకు స్కాలర్షిప్పులు మరణిస్తే 50000 ప్రమాద బీమా వంటివి ఎన్నో పథకాలను కరీంనగర్ డైరీ అందించడం అభినందనీయం అన్నారు చిగురుమామిడి మండల కేంద్రంలో అధ్యక్షులు పన్యాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన పక్క భవనాన్ని నిర్మించడం పట్ల అధ్యక్షుని సన్మానించి అభినందించారు అనంతరం రైతు వేదికల ఏర్పాటు చేసిన సమావేశంలో2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నాం.
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉందన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదు.భారతదేశంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికే పెద్ద పీట వేశారు సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను అక్కున చేర్చుకున్న ప్రభుత్వ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే.
ప్రజలకు అందాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్తవినిత శ్రీనివాస్ రెడ్డి జెడ్పిటిసి గీకురూ రవీందర్ సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి తాసిల్దార్ సయ్యద్ ముబీన్ అహ్మద్ ఎంపీడీవో మామిడి నరసయ్య వివిధ శాఖల అధికారులు వైస్ ఎంపీపీ బేతి రాజు రెడ్డి వైస్ చైర్మన్ కర్వేద మహేందర్ రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా మెంబర్ సాంబార కొమురయ్య టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మామిడ అంజయ్య ఇన్చార్జి కర్ర రవీందర్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కరీంనగర్ డైరీ మేనేజర్ చింతపూల నాగయ్య డైరీ సూపర్వైజర్ అప్పల మల్లయ్య టైర్ అధ్యక్షులు పన్యాల శ్రీధర్ రెడ్డి రైతులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News