Friday, September 20, 2024
HomeతెలంగాణChigurumamidi: ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ

Chigurumamidi: ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ

చిగురుమామిడిలో ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ చేపట్టారు. ఈ సoదర్భxగా మండల వైద్యాధికారి డా. ధర్మ నాయక్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ” దోమ పుట్టకుండా – దోమ కుట్టకుండe” జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అన్నారు, ఇంటి పరిసరాలలో ఖాళీ సీసాలు, కుండలు, పాత టైర్లు, కొబ్బరి బొండాలు, తాగి పడవేసిన టీ కప్పులు ఉండకుండ చూసుకోవాలి. వాటిలో వర్షపు నీరు నిల్చి డెంగ్యు దోమ పెరిగేటట్లు చేస్తాయని అవి పెరుగకుండ ఉండాలంటే వాటిని తీసివేయాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూడాలని, ప్రతి రోజు డ్రై డే గా పాటిస్తూ నీటి తొట్టెలు, ట్యాంకులు శుభ్రం చేసి ఆర బెట్టి నీటిని నింపి వాడుకోవాలని తెలియజేశారు.

- Advertisement -

మురికి గుంటలు నీరు నిల్వ ఉన్న చోట వాడి పడవెసిన ఆయిల్ బాల్స్ ను పడవేయాలని దానితో పాటు పైరిత్రం, అబెట్ స్ప్రే లను వాడుతూ దోమలు కుట్టకుండా నిండుగా దోమ తెరలు వాడాలని వీటి వల్ల దోమ కుట్టకుండా అరికట్టవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాదికారి డా. ధర్మ నాయక్, డా.ప్రత్యూష, డా, ఆఫ్సన, సూపర్వైజర్ హజిబబా, ఫార్మసీస్ట్ రామేశం, స్టాఫ్ నర్స్ భారతీ,గాయత్రి, ధనలక్ష్మి,కవిత,మమత, జ్యోతి,శైలజ,స్వాతి,మాలతి, స్వరూప రాణి,రజిత మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News