రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటిపై దాడి జరిగింది. ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో రంగరాజన్ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనసై ఆయన మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శుక్రవారం రంగరాజన్ నివాసానికి వీరరాఘవ రెడ్డి అనుచరులతో కలిసి వెళ్లారు. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుమారుడిపై కూడా దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రంగరాజన్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు వీరరాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.