చిగురుమామిడి మండలంలోని పలు గ్రామల్లో చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పాక్స్ చైర్మన్ జంగా వెంకటరమణ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెనుకుల తిరుపతితో కలిసి అకాల వర్షానికి వరి పంట తడవగా పలు పంట కొనుగోలు సెంటర్ లను సందర్శించి వారు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందకుడదని ఎమ్మెల్యే సూచన మేరకు తక్షణమే పంట కొనుగోలును మిల్లర్ తో, డిసిఎంఎస్ మేనేజర్ తో, జెసి తో మాట్లాడి తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించారు.
రేపటి నుండి అన్ని సెంటర్ లోని వరి పంటను కొనుగోలు కేంద్రలకు తరలిస్తారని రైతులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మామిడి అంజయ్య, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, మండల జనరల్ సెక్రటరీ మంకు శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు బోయిని మనోజ్, సర్పంచ్ లు బెజ్జంక్కి లక్ష్మణ్, జక్కుల రవి, అమూల్య మధుసూదన్ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు భూపతి రెడ్డి, గ్రామ అధ్యక్షులు బోయిని రమేష్, అచ్చ రవి, మహేందర్, ముంజ వెంకన్న, ఎండి.షరీఫ్, రైతులు పోత రాజు, మల్లయ్య, వరుకొలు బాలరాజు, రవి, రైతులు పాల్గొన్నారు.