Tuesday, September 17, 2024
HomeతెలంగాణChirumarthi: పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి

Chirumarthi: పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి

విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎస్ ఎస్ సి 2023 పరీక్షా ఫలితాలలో 10/10 సాధించి మండలంలో అగ్రగామిగా నిలిచిన క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని కనుతాల సాయిశ్రీతో పాటు పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువా కప్పి, మెమోంటోతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర వహించాలని కోరారు. నేడు ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో పట్టుసాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జె. మణి, ఉపాద్యాయులు శ్రీనివాస్, మురళి, నరేష్, స్వామి, పూనమ్, లక్మిదేవీ, కరుణా, అస్మా, ఫారియా, సంధ్యా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News