Saturday, April 5, 2025
HomeతెలంగాణChoppadandi-CMRF cheques distributed: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి

Choppadandi-CMRF cheques distributed: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి

సీఎం సహాయని చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం పంపిణీ చేశారు. రామడుగు మండల రైతు వేదికలో మొక్కను నాటి వివిధ గ్రామాలకు చెందిన 283 మంది లబ్ధిదారులకు 70 లక్షల 70 వేల ఐదువందల27 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆపదలో ఉన్న వివిధ అనారోగ్యాలతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ఉడుతా భక్తిగా ప్రభుత్వం కొంత సహాయం చేస్తుందని వివిధ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సీఎం సహాయనిధి అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మరవేని తిరుపతి , మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ కోల రమేష్,వీర్ల నర్సింగ రావు,రామడుగు మండల స్పెషల్ ఆఫీసర్ అనిల్,రామడుగు తాసిల్దార్ వెంకట లక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వరి, ఏపీ ఓ రాధా, తడగొండ హనుమంతు, నర్సింగ్ బాబు వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News