మరింత చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా పనిచేసి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి సర్వీసులు క్రమబద్ధీకరించబడ్డ జూనియర్ లెక్చరర్లు కృషి చేయాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. రెగ్యులరైజ్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని వివిధ కళాశాలలకు చెందిన పలువురు జూనియర్ లెక్చరర్లు బూరుగుపల్లిలోని ఎమ్మెల్యే నివాస గృహంలో ఆయనను కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్ఫ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, విద్యా ,వైద్య రంగాల ఉద్యోగులు, వీఆర్ఏలతో పాటు పలు ప్రభుత్వ విభాగాలలో పనిచేసే వారందరి కి మేలు కలిగించే నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లెక్చరర్లు వినియోగించుకుని ప్రభుత్వ కళాశాలలో విద్యాభ్యాసం చేసే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలని రవిశంకర్ సూచించారు. రెండు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహిస్తున్న తమ చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని లెక్చరర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ ను లెక్చరర్ల సంఘం నాయకులు శాలువా బొకేలతో సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్లు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, నరసయ్య, రాజయ్య ,బాలకృష్ణారెడ్డి, భాస్కర్, రాజు ,రాజగోపాల్, శ్రీధర్ పాల్గొన్నారు.