Saturday, March 29, 2025
HomeతెలంగాణCISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం

CISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో(CISCO) కీలక ఒప్పందం చేసుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సిస్కో బృందం సమావేశమైంది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు సీఎం సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ బృందం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News