Sunday, October 6, 2024
HomeతెలంగాణCITU: బిజెపిని ఎందుకు ఓడించాలో చెప్పే ర్యాలీ

CITU: బిజెపిని ఎందుకు ఓడించాలో చెప్పే ర్యాలీ

ఫిబ్రవరి 16న సెక్టోరియల్ సమ్మె

హైదరాబాదు నగరంలోని అఖిల కార్మిక సంఘాల సమావేశం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కార్మిక సంఘాల మరియు సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించిన క్యాంపెయిన్ హైదరాబాదు నగరంలో ఇంటింటికి తీసుకెళ్లడంపై చర్చించారు. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16వ తారీకు వరకు హైదరాబాదు నగరంలో బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఇంటింటి ప్రచారం చేయాలని, దానికి కావాల్సిన ప్లాన్ ను తయారు చేశారు.

- Advertisement -

ఈనెల 19న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలను ఉండగడుతూ సదస్సు నిర్వహించనుంది. జనవరి 26వ తారీకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి చిలకలగూడ చౌరస్తా వరకు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16న సెక్టోరియల్ సమ్మెకు పిలిపునిచ్చారు. బిజెపి ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించాలి అనే విషయాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే ఈశ్వర్ రావు, సిఐటియు నగర కార్యదర్శి ఎం వెంకటేష్, నగర అధ్యక్షులు కుమారస్వామి, సిఐటియు సౌత్ కమిటీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, అధ్యక్షులు మీనా, ఐఎఫ్టియు నాయకులు అనురాధ, ఏఐటియూసి నాయకులు నరసింహ కిషన్, సిఐటియు నగర ఉపాధ్యక్షులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News