విద్యార్థులు సాధన చేస్తే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం అంత కష్టమేమీ కాదని 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటార్ డాక్టర్ భవాని శంకర్ అన్నారు. ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ, వింగ్స్ మీడియా, G5 మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
క్రమ పద్ధతిలో
అందరూ అనుకునే విధంగా సివిల్ సర్వీసెస్ అంత కష్టమేమీ కాదని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక వేసుకొని చదివితే అనుకున్న లక్ష్యాలను సాధించడం సులభతరం అవుతుందని అన్నారు. దానికి ఉదాహరణగా గతంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన పేపర్లలో వచ్చిన ప్రశ్నలను ఆధారంగా ఎంతో సులభతరంగా అర్థం అవుతుందని విద్యార్థులకు సూచించారు. సివిల్ సర్వీసెస్ కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎన్ని స్టేజిలలో ఉంటుంది దానికి కావలసినటువంటి సమాచారాన్ని విద్యార్థులకు అందించారు. ప్రతి విద్యార్థి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని వారికి కావలసినటువంటి సమాచారాన్ని సేకరించుకుంటే ఇతర పరీక్షల కంటే సులభంగా సివిల్స్ కు చేరువ కావచ్చని సూచించారు.
అనంతరం 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ రాసిన పుస్తకాలను ఓపెన్ చేసి లైబ్రరీకి అందజేశారు. అవగాహనలో భాగంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బ్రదర్ అరుణ్ ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ సాధన శ్రీవత్సవ, అధ్యాపకులు వరుణ్ ,వాసవి, వేణుగోపాల్, దీపిక వింగ్స్ మీడియా తరుపున గిరి ప్రకాష్, గణేష్, మహేష్ పాల్గొన్నారు.