Wednesday, October 30, 2024
HomeతెలంగాణWarangal : బర్త్ డే పార్టీ విషయంలో గొడవ.. 5గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం

Warangal : బర్త్ డే పార్టీ విషయంలో గొడవ.. 5గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం

బర్త్ డే పార్టీ విషయంలో విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ.. వారు ఆత్మహత్యాయత్నం చేసేంత వరకూ తీసుకెళ్లింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. ఆరేపల్లిలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. హాస్టల్ లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే పార్టీ విషయంలో గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురైన ఐదుగురు విద్యార్థినులు ఫినాయిల్ తాగేశారు. దీంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు.

- Advertisement -

తోటి విద్యార్థినులు వెంటనే.. విషయాన్ని హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో.. ఐదుగురు బాలికలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం వారంతా అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలికల హాస్టల్‌లో ఒక విద్యార్థిని బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు హాస్టల్ విద్యార్థులు కాకుండా, బయటివాళ్లు ఎక్కువగా హాజరు కావడంపై హాస్టల్ అధికారులు విద్యార్థినులను మందలించారు. దీంతో ఈ అంశంపై విద్యార్థినుల మధ్య గొడవ జరిగింది. ఆవేదనకు గురైన బాలికలు.. ఆవేశంతో హాస్టల్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News